Jul 13 2021 @ 08:44AM

రామ్ 19లో విలన్‌గా ఆర్య..?

ఎనర్జిటిక్ హీరో రామ్ - లింగు స్వామి కాంబినేషన్‌లో ఓ మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసందే. ఇటీవలే సెట్స్‌పైకి వచ్చింది. ఇందులో రామ్ కి విలన్‌గా ఆర్య నటించబోతున్నాడని సమాచారం. తమిళంలో హీరోగా నటిస్తున్న ఈ హీరో తెలుగులో 'వరుడు', 'సైజ్ జీరో' లాంటి సినిమాలలో నటించాడు. తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆర్యకి బాగానే ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న రామ్ 19లో పవర్‌ఫుల్ విలన్ పాత్రకోసం ఆర్యను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ త్వరలో రానుందట. 'ఉప్పెన' ఫేం కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాసా చిట్టూరి సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.