Oct 26 2021 @ 16:00PM

Aryan Khan కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. చిక్కుల్లో Ananya Pandey.. కొత్త వాట్సప్‌ చాటింగ్‌‌ను బయటపెట్టిన NCB..!

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాట్ ఆధారంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ముందుకెళ్తున్నారు. ఆర్యన్‌తో బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనన్యా పాండే డ్రగ్స్ గురించి ఛాట్ చేసినట్టు ఎన్‌సీబీ అధికారులు కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనన్యను రెండో రోజులు విచారించారు. మరోసారి అనన్య విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణలో భాగంగా ఆర్యన్‌తో డ్రగ్స్ ఛాట్ గురించి అనన్యను ప్రశ్నించినపుడు `కేవలం జోక్ చేశాన`ని చెప్పింది. 


తాజాగా మరో వాట్సాప్ ఛాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్యన్, అనన్య ఉన్న వాట్సాప్ గ్రూప్ ఛాట్‌ తాజాగా బయటకు వచ్చింది. ఈ ఛాట్‌లో ఆర్యన్, అనన్య డ్రగ్స్ గురించి మేసేజ్‌లు పంపుకున్నారు. ఒక మెసేజ్‌లో `రేపు కొకైన్ తీసుకుందాం.. నేను తీసుకువస్తానని` అని ఆర్యన్ పేర్కొన్నాడు. అలాగే చరాస్ అనే మత్తుపదార్థం గురించి ఆర్యన్ అడగ్గా.. ప్రస్తుతం దానికి చాలా డిమాండ్ ఉందని అనన్య పేర్కొంది. అచిత్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.80 వేల విలువైన డ్రగ్స్ కొంటున్నట్టు ఆర్యన్ ఆ ఛాట్‌లో పేర్కొన్నాడు. 

Bollywoodమరిన్ని...