Aryan Khan బెయిల్ పిటిషన్ రద్దవడంతో.. షారూఖ్ ఖాన్ తాజా నిర్ణయమిదే..!?

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రయత్నాలు ఫలించలేదు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ దొరకలేదు. మూడో సారి కూడా ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల వాదనతో ఏకీభవించిన ముంబై స్పెషల్ కోర్టు ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈసారి తప్పకుండా ఆర్యన్‌కు బెయిల్ వస్తుందనుకున్న షారూక్ కుటుంబం షాక్‌కు గురైంది. 


ముంబై స్పెషల్ కోర్టు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించడంతో అతడి తరఫు న్యాయవాది ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారట. అయితే అప్పటి వరకు ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఈ నెల రెండో తేదీన ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ ఆర్యన్ ఎన్‌సీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నంచి ఆర్యన్ జైలులోనే ఉన్నాడు. ఇప్పటికే రెండు సార్లు అతడి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఓ కొత్త హీరోయిన్‌తో ఆర్యన్ డ్రగ్స్ గురించి ఛాట్ చేసినట్టు ఎన్‌సీబీ అధికారులు బయటపెట్టడంతో తాజాగా మూడో సారి కూడా బెయిల్ దొరకలేదు.  

Advertisement

Bollywoodమరిన్ని...