Aryan Khan బెయిల్‌పై టెన్షన్ టెన్షన్.. ముంబై హైకోర్టులో ఇన్ని రోజుల పాటు వాదనలు జరగడం వెనుక..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హై కోర్టు ఏం తీర్పు ఇస్తుందోననేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల రెండో తేదీన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ముంబై స్పెషల్ కోర్టు మూడుసార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫు న్యాయవాది ముంబై హై కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం కానుంది. 


నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించనున్నారు. అనిల్ గంటలోపే తన వాదనను పూర్తి చేస్తే ఈ రోజు ఈ పిటిషన్‌పై తీర్పు వచ్చేస్తుంది. ఆలస్యమైతే మాత్రం తీర్పు శుక్రవారానికి వాయిదా పడుతుంది. బుధవారం జరిగిన విచారణలో ఆర్యన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసు చాలా క్లిష్టమయినది  కాబట్టి.. అందరి వాదనలకు సంబంధించిన రిపోర్టులను న్యాయమూర్తి క్షుణ్ణంగా చదువుతున్నారట. తీర్పులో పొరపాటుకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్న కారణంతో రోజుల తరబడి వాదనలను వింటున్నారట. అందుకే తుది తీర్పు కోసం న్యాయమూర్తి ఇన్ని రోజుల సమయం తీసుకున్నారని సమాచారం. 

Advertisement

Bollywoodమరిన్ని...