Aryan khan కు కొత్త టెన్షన్.. ఏడు రోజుల్లోగా బెయిల్ రాకపోతే జరిగేది ఇదే..

వరుసగా మూడో సారి కూడా ముంబై స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో బాలీవుడ్ బాద్ షా తనయుడు ఆర్యన్ ఖాన్ నిరాశలో కూరుకుపోయాడు. అయితే షారూక్ మాత్రం బెయిల్ కోసం సకల ప్రయత్నాలూ చేస్తున్నాడు. ముంబై స్పెషల్ కోర్టులో చుక్కెదురు కావడంతో ఆర్యన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ ముంబై హై కోర్టును ఆశ్రయించాడు.


ముంబై హై కోర్టులోని సింగిల్ బెంజ్ జడ్జ్ ముందుకు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు షారూక్‌ను, అతడి శ్రేయోభిలాషులను ఓ విషయం కలవరపెడుతోంది. ఆ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ముంబై హై కోర్టుకు ఏడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి ముంబై హై కోర్టుకు వరుసగా దీపావళి సెలవులు రాబోతున్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హై కోర్టుకు సెలవులు రానున్నాయి. ఒకటో తేదీ లోపు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగకపోతే మరో 14 రోజుల పాటు ఆర్యన్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది.  


Advertisement

Bollywoodమరిన్ని...