Abn logo
Oct 20 2021 @ 15:01PM

ఆర్యన్‌కు బెయిల్ నిరాకరణ

ముంబై: మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ హీరో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. బెయిలు కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును ముంబై స్పెషల్ కోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది.రేపటి వరకూ ఆర్యన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది.ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది. అక్టోబర్ 2న ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు.