Abn logo
Oct 5 2021 @ 16:26PM

ఎన్సీబీ ఎదుట ఆర్యన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు..!

ముంబై: డ్రగ్స్ కేసులో ఎన్సీబీకి చిక్కిన షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తన తండ్రిని కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలని, మేనేజర్‌తో మాట్లాడి అపాయింట్‌మెంట్  తీసుకుని తండ్రిని కలుస్తానని ఆర్యన్ ఎన్సీబీకి చెప్పినట్లు తెలియవచ్చింది.


డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకుగానే కొందరికి తెలిసిన ఆర్యన్.. ఈ కేసు మూలంగా అత్యంత వివాదాస్పద రీతిలో అందరికీ పరిచయమయ్యాడు. త్వరలో అత్యంత గ్రాండ్‌గా వెండితెరకు పరిచయం అవుతాడనుకున్న ఆర్యన్ ఇలా అరెస్ట్ కావడాన్ని షారూక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption