నాకు బెయిల్ వచ్చిందని హ్యాపీగా చెప్తూనే.. జైల్లో తన బ్యారెక్‌లోని ఖైదీలకు Aryan Khan ఏం హామీ ఇచ్చాడంటే..

దాదాపు 25 రోజుల నుంచి జైలు జీవితం గడుపుతున్న ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ ఈ రోజే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశముంది. తనకు బెయిల్ లభించినట్టు గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆర్యన్‌కు తెలిసిందట. దీంతో ఆర్యన్ ఎంతో సంతోషపడ్డాడట. తన సంతోషాన్ని ఇతర ఖైదీలతో పంచుకున్నాడట. అంతేకాదు వారిలో కొంతమందికి ఓ హామీ కూడా ఇచ్చాడట. 


తన బ్యారక్‌లో ఉన్న కొందరి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడట. కొందరికి పని కల్పిస్తానని, మరికొందరికి ఆర్థికంగా సహాయం చేస్తానని మాట ఇచ్చాడట. దీంతో వారందరూ ఆర్యన్‌కు ధన్యవాదాలు తెలియజేశారట. ఈ నెల రెండో తేదీన డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆర్యన్ ఆర్థర్ రోడ్డు జైలులోనే ఉంటున్నాడు. గురువారం ముంబై హై కోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. 

Advertisement

Bollywoodమరిన్ని...