Oct 17 2021 @ 14:52PM

Aryan Khan: అందరూ గర్వపడేలా మారుతానంటున్న ఆర్యన్ ఖాన్..ఎన్సీబీ జోనల్ డైరెక్టర్‌కు హామీ

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే.అనంతరం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో( ఎన్‌సీబీ) అధికారులు ఆర్యన్‌ను జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.ఆర్యన్‌ కొన్నిరోజుల తర్వాత బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ బెయిల్ పిటిషన్ అక్టోబర్ 20వ తేదీన విచారణకు రానుంది. 


ఎన్సీబీ అధికారులు  జైలులో ఆర్యన్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. తను మంచి పనులు చేస్తానని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఆర్యన్ హామీ ఇచ్చాడని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘ తప్పుడు మార్గంలో నడవను. భవిష్యత్తులో అందరూ గర్వపడేలా నేను మారుతాను. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత సామాజికంగా వెనుకబడిన వారికి చేయూతనందిస్తాను ’’ అని ఆర్యన్ తెలిపాడని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.  


ప్రస్తుతం ఆర్యన్ ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉన్నారు. కొవిడ్ నెగెటివ్ గా తేలిన అనంతరం అతడిని సాధారణ జైలు గదికి తరలించారు. తన తల్లిదండ్రులతో దాదాపుగా 10నిమిషాల పాటు అతడు జైలు నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ కాల్ సమయంలో తన తల్లిదండ్రులను చూసి ఆర్యన్ వెక్కివెక్కి ఏడ్చాడని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి.

Bollywoodమరిన్ని...