Sep 22 2021 @ 00:52AM

విధవరాలిగా?

మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అస్తిత్వ’ చిత్రంలో టబు నటించారు. పురుష దురహంకారం, వివాహేతర సంబంధాల నేపథ్యంలో తెరకెక్కింది. జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ మరాఠీ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రం విడుదలై 21 సంవత్సరాలవుతోంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ టబు, మహేశ్‌ మంజ్రేకర్‌ కలిసి సినిమా చేయబోతున్నారని హిందీ చిత్రసీమ విశ్వసనీయ వర్గాల కథనం. ఓ విధవరాలి చుట్టూ తిరిగే కథతో మహేశ్‌ మంజ్రేకర్‌ ‘వైట్‌’ సినిమా ప్రకటించారు. అందులో ప్రధాన పాత్రకు టబును తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది వేసవిలో సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది.


Bollywoodమరిన్ని...