Aug 4 2021 @ 01:26AM

లక్కీ స్టార్‌గా...

‘కె.జి.యఫ్‌’తో తెలుగులోనూ పేరు తెచ్చుకున్న కన్నడ హీరో యశ్‌. సూరి దర్శకత్వంలో ఆయన నటించిన కన్నడ సినిమా ‘లక్కీ’. తెలుగులో ‘లక్కీ స్టార్‌’గా విడుదల కానుంది. కన్నడలో చిత్రాన్ని నిర్మించిన రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత రవిరాజ్‌ తెలుగులో అనువదిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘లవ్‌, కామెడీ, యాక్షన్‌ మేళవించిన చిత్రమిది. కన్నడలో యశ్‌కు స్టార్‌డమ్‌ తెచ్చిన చిత్రాల్లో ఇదొకటి. తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అనువాద కార్యక్రమాలు చివరిదశకు వచ్చాయి. మాటలు, పాటలు గురుచరణ్‌ రాశారు. ‘రాబర్ట్‌’ ఫేమ్‌ అర్జున్‌ జన్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. యశ్‌ సరసన రమ్య కథానాయికగా నటించారు.