Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంక్రాంతి నాటికి దేవస్థానం భూ సమస్య పరిష్కారం

ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పెందుర్తి రూరల్‌, నవంబరు 28: సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచగ్రామాల భూ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనున్నదని, సంక్రాంతి పండుగ నాటికి దేవస్థానం భూ సమస్యను పరిష్కరించే దశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తెలిపారు. నాలుగు దశల్లో భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. ఆదివారం పెందుర్తి తాండ్ర పాపారాయుడు కల్యాణ మండపంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ దశాబ్దాల క్రితం నుంచి పంచగ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ నెల 25న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై భూ సమస్యపై చర్చించారని ఆయన తెలిపారు. వంద గజాలలోపు గల వారికి ఉచితంగా, 100 నుంచి 300 గజాల స్థలం గలవారు 1998లో జారీ అయిన జీవో ప్రకారం 70 శాతం మార్కెట్‌ ధర చెల్లించాలన్నారు. 300 గజాల పైబడి స్థలం గలవారు, కమర్షియల్‌ యూనిట్‌ గలవారు పూర్తి శాతం మార్కెట్‌ ధర చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో 97వ వార్డు కార్పొరేటర్‌ ముమ్మన దేముడు, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొర్లె రామునాయుడు, వైసీపీ నాయకులు నక్కా కనకరాజు, ఆదిరెడ్డి మురళి పాల్గొన్నారు.


Advertisement
Advertisement