AFCAsianCup: 2023 ఆసియా కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టు

ABN , First Publish Date - 2022-06-14T22:43:20+05:30 IST

సునీల్ ఛత్రి నేతృత్వంలోని భారత ఫుట్ బాల్ జట్టు ఏఎఫ్‌సీ ఆసియా కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. భారత్ వరుసగా..

AFCAsianCup: 2023 ఆసియా కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టు

కోల్‌కత్తా: సునీల్ ఛత్రి నేతృత్వంలోని భారత ఫుట్ బాల్ జట్టు ఏఎఫ్‌సీ ఆసియా కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. భారత్ వరుసగా ఐదో సారి ఆసియా కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా జట్టు హాంకాంగ్ జట్టుతో తలపడనుంది. ఫిలిప్పైన్స్ జట్టుపై పాలస్తీనా జట్టు 4-0 తేడాతో గెలుపొందడంతో భారత్ ఫైనల్స్‌కు చేరింది. ప్రస్తుతం గ్రూప్-డీలో రెండో స్థానంలో ఉన్న Blue Tigers (ఇండియన్ ఫుట్‌బాల్ టీం) క్వాలిఫికేషన్ రౌండ్స్‌లో అర్హత సాధించిన బెస్ట్ సెకండ్ ప్లేస్డ్ టీమ్స్‌లో ఒకటి కావడం గమనార్హం. జూన్ 17న ఇండియన్ ఫుట్‌బాల్ టీం కోల్‌కత్తాలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఢీ కొట్టబోతోంది.



గ్రూప్-డీ లో హాంగ్ కాంగ్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇండియా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛత్రి మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. కంబోడియా జట్టును 2-0 తేడాతో తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఇండియా ఓడించింది. అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కూడా 2-1 తేడాతో ఇండియా ఫుట్ బాల్ టీం విజయం సాధించింది.

Updated Date - 2022-06-14T22:43:20+05:30 IST