రామాయణంలో ఆ ఒక్క సీన్‌కు భలే మీమ్స్!

ABN , First Publish Date - 2020-04-02T22:27:01+05:30 IST

ఒకప్పుడు యావత్ దేశాన్ని భక్తిపారవశ్యంలో ముంచిన ధారవాహిక రామాయణం దూరదర్శన్‌లో పునఃప్రసారం

రామాయణంలో ఆ ఒక్క సీన్‌కు భలే మీమ్స్!

న్యూఢిల్లీ: ఒకప్పుడు యావత్ దేశాన్ని భక్తిపారవశ్యంలో ముంచిన ధారవాహిక రామాయణం దూరదర్శన్‌లో పునఃప్రసారం అవుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో దేశం మొత్తం ఇంటికే పరిమితం కావడంతో ఈ సీరియల్‌కు జనం మళ్లీ జేజేలు పలుకుతున్నారు. అప్పట్లో లభించిన ఆదరణే ఇప్పుడు కూడా ఈ సీరియల్‌కు లభిస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ సీరియల్‌లోని ఒక సీన్‌కు సంబంధించిన మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాముడు చుట్టూ తిరిగే ఈ మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. అది రామాయణంలో చివరి యుద్ధం. లంకాధిపతి రావణుడితో రాముడు తలపడుతున్నాడు. రాముడు ఎన్ని బాణాలు ప్రయోగించినా ఫలితం ఉండడం లేదు. అతడి పొట్టలోని అమృతభాండం అతడిని పదేపదే బతికిస్తోంది. అప్పుడు రాముడి పక్కనే ఉన్న రావణుడి సోదరుడు విభీషణుడు.. రాముడితో ‘బాణాన్ని అతడి పొట్టలోకి సంధించండి ప్రభూ’ (ఇస్‌కే పేఠ్ పర్ బాణా మారియె ప్రభూ) అని అంటాడు. ఇప్పుడిదే సీన్‌కు నెట్‌లో రకరకాల మీమ్స్ దర్శనమిస్తున్నాయి. విభీషణుడు రాముడితో అన్న మాటలను ఎటువంటి సందర్భంలో ఉపయోగిస్తారో చెబుతూ వచ్చిన మీమ్స్‌లో కొన్ని..


* మా ఇంటికొచ్చిన అతిథి సమోసాలన్నీ లాగించేటప్పుడు మా అన్నతో నేనలా అంటా..

* మా అన్నయ్య మ్యాగీని కూడా నేనే లాగించినప్పుడు మా అన్న మా నాన్నతో ఇలా..

* ఎవరైనా పెద్దగా శబ్దం చేస్తూ తింటున్నప్పుడు..

* మీ గాళ్ ఫ్రెండ్ ముందే మీ స్నేహితుడు మిమ్మల్ని హేళన చేస్తూ నవ్వినప్పుడు.. మీరు

* వికెట్ కావాలనుకున్నప్పుడు కోహ్లీ..

Updated Date - 2020-04-02T22:27:01+05:30 IST