యశోదగా..

‘శాకుంతలం’ చిత్రం తర్వాత సమంత నటించే మరో హీరోయిన్‌ ఓరియంటేడ్‌ ఫిల్మ్‌ ‘యశోద ’ పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభమైంది. ‘ఫ్యామిలీమ్యాన్‌ 2’ వెబ్‌ సిరీ్‌సతో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. అందుకే ఆమెకున్న క్రేజ్‌ను, పొటెన్షియాలిటీని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తయారువుతోంది. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకద్వయం హరి, హరీష్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘సమంత ప్రధాన పాత్రను పోషిస్తున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రమిది. థ్రిల్లర్‌ జానర్‌లో నేషనల్‌ లెవల్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకొనే కథాంశంతో తీస్తున్నాం. సమంత క్రేజ్‌, పొటెన్షియల్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు’ అని తెలిపారు. చిత్రంలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డాక్టర్‌ చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక.


Advertisement