Sep 24 2021 @ 18:01PM

అక్టోబర్ 1న.. ‘అసలేం జరిగిందంటే..’

‘పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి’ వంటి చిత్రాలలో బాల నటుడిగా నటించిన మహేంద్రన్ కథానాయకుడిగా.. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ అనిల్ బొద్దిరెడ్డి సమర్పణలో జి.ఎస్. ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలేం జరిగిందంటే...’. ఈ చిత్రాన్ని అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 


ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..‘‘బాలనటుడిగా అందరికీ సుపరిచితమైన మహేంద్రన్.. ముగ్గురు హీరోయిన్లతో నడిపే ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో పాటు సస్సెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ‘రమణా లోడెత్తాలిరా’ ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి, దొరబాబు వంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. ఫ్యామిలీ సభ్యులంతా కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం..’’ అని తెలిపారు.