తొలి టెస్టుకు అండర్సన్‌ దూరం

ABN , First Publish Date - 2021-12-08T09:11:53+05:30 IST

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ బుధవారం నుంచి ఆరంభం కాబోతోంది.

తొలి టెస్టుకు అండర్సన్‌ దూరం

నేటి నుంచి యాషెస్‌ సిరీస్‌


బ్రిస్బేన్‌: ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ బుధవారం నుంచి ఆరంభం కాబోతోంది. అయితే పని ఒత్తిడిలో భాగంగా ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు తొలి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించారు.  జిమ్మీ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తోనే ఉన్నాడని, ఆరు వారాల్లో ఐదు టెస్టులు ఆడాల్సి ఉన్నందున ముందుజాగ్రత్తగా అతడికి రెస్ట్‌ ఇచ్చినట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టుకు 39 ఏళ్ల అండర్సన్‌ అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు దిగ్గజాలతో కూడిన తమ జట్టును ఓడించడం అంత సులువు కాదని ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ వికెట్‌ తమకు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డాడు. ఇక ఆసీస్‌ గడ్డపై ఆడిన చివరి 10 టెస్టుల్లో ఇంగ్లండ్‌ తొమ్మిదింటిని ఓడిపోవడం గమనార్హం.

Updated Date - 2021-12-08T09:11:53+05:30 IST