Abn logo
Oct 15 2021 @ 01:23AM

సీఎంను కలవలేని ‘నేతలు’ ఏం సాధిస్తారు?: అశోక్‌బాబు

‘‘ముఖ్యమంత్రిని కలవడానికి సమయం సంపాదించలేని ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారాలు ఏం సాధిస్తారు?’’ అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు.  ‘‘ఉద్యోగుల సమస్యలపై సీఎం లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించాలి. మాట్లాడాలి. సలహాదారులు కాదు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నెలాఖరుకు పీఆర్‌సీపై నిర్ణయం తీసుకొంటామని అన్నారు. అది ప్రభుత్వ హామీనా? సజ్జల చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు సంబరపడిపోతే ఉపయోగం లేదు’’ అని అన్నారు.  ప్రాణాలైనా అర్పిస్తామని గతంలో అన్న నేతలు ఇప్పుడు కనీసం చలో అసెంబ్లీ కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు.