Abn logo
Jun 15 2021 @ 11:48AM

సీఎంకు, మంత్రులకు జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్న: అశోక్ గజపతి

విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మాన్సాస్ ఛైర్మన్, సింహాచలం దేవస్థాన అనువంశిక ధర్మకర్త హోదాకు అశోక్ గజపతిరాజే అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అశోక్ తన కుటుంబ సభులతో, పార్టీ నేతలతో పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణ కలశంతో అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం శేషవస్త్రం, ప్రసాదాలను పూజారులు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది, మంత్రులకు మంచి జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు. నిన్న మొన్నటి వరకు శాశ్వత నష్టం చేకూర్చినవారిలా కాకుండా మూగజీవాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.