అశోక్ గజపతిరాజు ఆస్తులపై ఆయన కన్ను పడిందా?

ABN , First Publish Date - 2021-06-18T02:33:14+05:30 IST

అశోక్ గజపతిరాజు ఆస్తులపై ఆయన కన్ను పడిందా?

అశోక్ గజపతిరాజు ఆస్తులపై ఆయన కన్ను పడిందా?

విశాఖ‌లో జ‌రిగిన దేవ‌దాయ‌శాఖ  స‌మావేశంలో అస్స‌లు జ‌రిగింది? స‌మావేశం ఏ శాఖ‌ది?. మాట్లాడింది ఏవ‌రు?. అస‌లు ఆ శాఖ‌లో ఎవ‌రిని టార్గెట్ చేస్తూ ఈ స‌మావేశం జ‌రిగింది.


విశాఖ‌ప‌ట్నంలో మంత్రి  వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో దేవ‌దాయ‌శాఖ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ స‌మావేశానికి దేవ‌దాయ‌శాఖ, ఉన్న‌తాధికారుల నుంచి క్రింది స్థాయి అధికారులవ‌ర‌కు అంద‌రు హాజ‌ర‌య్యారు. మంత్రులు కన్న‌బాబు, అవంతితో పాటు విజ‌య‌సాయిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజ‌ర‌య్యారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉంది. స‌మీక్ష ప్రారంభ‌మైంది. దేవ‌దాయ‌శాఖ సంబంధించిన  వివిధ ఆంశాల‌పై ప్రారంభ‌మైన చ‌ర్చ ఎక్కువ శాతం  దేవాదాయశాఖ భూముల‌ను ప‌రిర‌క్షించాల‌ని జ‌రిగింది. చాలా వ‌ర‌కు నిధులు లేని ప‌రిస్థితి ఉంద‌ని స‌మాధానం వ‌చ్చింది. అయితే కొంత స‌మ‌యం చ‌ర్చ జ‌రిగిన త‌రువాత మ‌ళ్లీ విజ‌య‌న‌గ‌రం మాన్స‌స్ భూములే టార్గెట్‌గా స‌మావేశం జ‌రిగింది. స‌మావేశం మొత్తాన్ని లీడ్ చేసింది విజ‌య‌సాయిరెడ్డే. 


ముందురోజు విజ‌య‌న‌గ‌రంలో మంత్రి, క‌మిష‌న‌ర్, ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీతో స‌హా అంతా అక్క‌డ జిల్లా అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌కు మాన్స‌స్ ఈవో, విజ‌య‌న‌గ‌రం జాయింట్ క‌ల‌క్ట‌ర్, ఆర్డీవోల‌ను కూడా పిలిచారు. అస‌లు మాన్స‌స్ భూములు ఎంత ఉన్నాయి. రికార్డుల్లో లేని భూములు ఏంత ఉన్నాయి. రాజుగారి కుటుంబ స‌భ్యుల పేరు మీద ఉన్న భూములు,  సంస్థ‌లు ఇలా మొత్తం విజ‌య‌న‌గ‌రం చూట్టూనే తిరిగింది. వాటికి సంబంధించిన మొత్తం వివ‌రాలు వారం రోజుల్లో సేక‌రించాల‌ని కూడా ఆదేశించారు. అంతేకాదు. విశాఖ‌లో కూడా అశోక్ గ‌జ‌ప‌తిరాజు, మాన్స‌స్, భూముల వివ‌రాల‌ను కూడా ఇవ్వాల‌ని  కోరార‌ట. మీడియా స‌మావేశంలో సైతం మాన్స‌స్ భూముల‌ను అశోక్ గ‌జ‌ప‌తిరాజు అమ్ముకోవాల‌ని చూస్తున్నార‌ని, రికార్డులు తారుమారు చేశారని, ఆయ‌నే ఒక దొంగ అంటూ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు. కోర్టు ఆదేశాల‌పై డివిజ‌న్ బెంచ్‌కు వెళ్తామ‌ని, గెలుస్తామంటూ ఆయ‌న్ను చైర్మ‌న్ కుర్చీ నుంచి తొల‌గిస్తామ‌ని కూడా చెప్ప‌డం వెనుక అంత‌ర్యం పూర్తిగా అర్థమవుతోంది. 


అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా సింహాచ‌లం దేవ‌స్థానం వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్య‌లే చేశారు. మ‌రోవైపు విజ‌య‌సాయిరెడ్డి రంగంలో దింపిన సంచ‌యిత గ‌జ‌ప‌తి నియామ‌కం చెల్ల‌క‌పోవ‌డంతో ఏలాగైనా అశోక్ గజ‌ప‌తిరాజును భూముల విష‌యంలో ఇరికించి ఇబ్బందులు పెట్టాల‌ని విజ‌య‌సాయిరెడ్డి, ప్ర‌భుత్వం సంక‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌కీయంగా ఆయ‌న్ను  టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాల‌నే ఆలోచ‌న ఈ మీటింగ్‌లో స్ప‌ష్ట‌మైంది. వాస్త‌వంగా చాలా వ‌ర‌కు వారి ఆస్తుల వివ‌రాల‌ను  విజ‌య‌న‌గ‌రం రాజుల‌కే తెలియ‌దు.  చాలావర‌కు అన్యాక్రాంత‌మైన మాట వాస్త‌వం. చాలా వ‌ర‌కు వారి ఆస్తులు ఎక్క‌డున్నాయో వారికే తెలియ‌ని పరిస్థితి ఉంది.  కొన్ని వారికి తెలియ‌కుండానే చేతులు మారిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి.  ఇప్పుడు  ప్ర‌భుత్వం అస‌లు విజ‌య‌న‌గ‌రం సంస్థానం మొత్తం ఆస్తుల మీద క‌న్ను వేసి, వాటి వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ఉంది. బుధవారం జరిగిన స‌మావేశం అంత‌ర్యం, అంత‌రార్దం అదే. చైర్మ‌న్ ప‌ద‌వి తిరిగి వారికే కోర్టు ద్వారా రావ‌డం ప్రభుత్వం జీర్ణించుకోలేక‌పోతుంది. ఇప్పుడు  రాజ‌కుటుంబాన్నే టార్గెట్ చేసి అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఏదో విష‌యంలో ఇరికించాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.


ఇప్ప‌టికే  కోర్టు ఆదేశాల‌తో ఆయ‌నే చైర్మ‌న్ కానీ, అధికారులు ఆయ‌న ద‌గ్గ‌రకు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. వెళ్తే  ప్ర‌భుత్వం  ఏలాంటి క‌క్ష సాధింపు చేప‌డుతుందోన‌నే భ‌యం మొద‌లైంది. సింహాచ‌లం దేవస్థానానికి అశోక్ గ‌జ‌ప‌తిరాజు వెళ్లినా ఈవో, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. మాన్స‌స్ ట్ర‌స్ట్‌లో కూడా అదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. మరోవైపు  ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌కు వెళ్తామంటోంది. అటు చైర్మ‌న్, ఇటు ప్ర‌భుత్వం మ‌ధ్య‌లో అధికారులుగా మారింది.

Updated Date - 2021-06-18T02:33:14+05:30 IST