Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ధి రావడం లేదు: అశోక్‌గజపతిరాజు

విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ విషయంలో తన నియామకంపై హైకోర్ట్ మరోసారి అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ధి రావడం లేదని చెప్పారు. ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం మాన్సాస్‌ వ్యవహారంలో తలదూర్చిందని దుయ్యబట్టారు. హిందువుల దేవాలయాలపై వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆచారాలకు విరుద్ధంగా నియమాలు మార్చారని తప్పుబట్టారు. ఆదాయం వచ్చే ఆలయాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రభుత్వం చూస్తోందని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పిన సంచయిత.. కోటి రూపాయలు పెట్టి రెండు కార్లు ఎలా కొన్నారని ప్రశ్నించారు. తనపై ఉన్న కోపాన్ని విద్యార్థులపై చూపించడం దారుణమైన చర్య అని అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు.మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నలిచ్చింది. అశోక్‌గజపతిరాజును పునర్‌ నియమిస్తూ సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై  ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. సీజే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం, సంచయిత వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సీజే బెంచ్‌ సమర్థించింది.

Advertisement
Advertisement