విరాళాన్ని తిరస్కరిస్తారా?

ABN , First Publish Date - 2021-01-17T17:46:40+05:30 IST

కోదండరాముని విగ్రహ తయారీకి భక్తితో..

విరాళాన్ని తిరస్కరిస్తారా?

అశోక్‌గజపతిరాజు ఆవేదన 


విజయనగరం: కోదండరాముని విగ్రహ తయారీకి భక్తితో ఇచ్చిన విరాళాన్ని  తిరస్కరించడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ పూర్వపు చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల కిందట ఆయన రామతీర్థంలో విగ్రహం తయారీకి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుని హోదాలో రూ.లక్ష విరాళాన్ని రిజిస్టర్‌ పోస్టు ద్వారా రామతీర్థం ఈవోకు పంపారు. దీనిని ఈవో ప్రభుత్వానికి నివేదించారు. పరిశీలించిన ప్రభుత్వం విరాళాన్ని తిరస్కంచింది. ఈ నేపథ్యంలో శనివారం అశోక్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా.. దేవదాయశాఖ చట్టం 28ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లఘించి, తనను దేవస్థానం చైర్మన్‌గా తొలగించిందన్నారు. దేవాలయాలకు భక్తులు విరాళాలు ఇవ్వడం సర్వసాధారణమని, అనువంశిక ధర్మకర్తగా పనిచేసిన వ్యక్తిగా కొత్త విగ్రహం ఏర్పాటుకు విరాళం ఇచ్చానన్నారు. డీజీపీ నిజాలు చెప్పడం నేర్చుకోవాలని, రాగద్వేషాలకు అతీతంగా ఉంటామని ప్రమాణం చేసి దానిని పాటించడం లేదన్నారు. 


Updated Date - 2021-01-17T17:46:40+05:30 IST