రెండోసారి సీఎల్పీ భేటీ.. సచిన్ పైలట్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-07-14T03:24:23+05:30 IST

జైపూర్: రాజస్థాన్‌లో 24 గంటల్లో రెండోసారి సీఎల్‌పి సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం పదిగంటలకు జరిగే సమావేశానికి రావాలంటూ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు ఆహ్వానం పంపారు.

రెండోసారి సీఎల్పీ భేటీ.. సచిన్ పైలట్‌కు ఆహ్వానం

జైపూర్: రాజస్థాన్‌లో 24 గంటల్లో రెండోసారి సీఎల్‌పి సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం పదిగంటలకు జరిగే సమావేశానికి రావాలంటూ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు ఆహ్వానం పంపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశానికి 107 మంది ఎమ్మెల్యేలకు గానూ 84 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. సమావేశం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బస్సుల్లో హోటల్‌కు తరలించారు.


200 మంది సభ్యులున్న రాజ్యసభ అసెంబ్లీలో మ్యాజిక్ నెంబర్ 101. తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని సచిన్ ప్రకటించిన నేపథ్యంలో గెహ్లాట్ సర్కారు గట్టెక్కాలంటే ఆయన మద్దతు తప్పనిసరి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పైలట్‌‌ను దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. స్వయంగా రాహుల్, ప్రియాంకతో పాటు అహ్మద్ పటేల్, చిదంబరం తదితరులు సచిన్ పైలట్‌ను బుజ్జగిస్తున్నారు. సచిన్ కనుక మాట వినకపోతే గెహ్లాట్ సర్కారు కుప్పకూలిపోవడంతో పాటు బీజేపీకి అధికార పీఠం దక్కే అవకాశాలున్నాయి. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీకి ఛాన్స్ ఇవ్వొద్దని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది.    

Updated Date - 2020-07-14T03:24:23+05:30 IST