అశ్వగంధ

ABN , First Publish Date - 2020-12-29T05:52:18+05:30 IST

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రమైన ఆయుర్వేదంలో అశ్వగంధతో తయారుచేసిన అశ్వగంధారిష్ట ఉపయోగాల గురించి తెలుసుకున్నాం.

అశ్వగంధ

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రమైన ఆయుర్వేదంలో అశ్వగంధతో తయారుచేసిన అశ్వగంధారిష్ట ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. అశ్వగంధకు ఉన్న మరికొన్ని ప్రధానమైన రూపాలు అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ చూర్ణం. అశ్వగంధారిష్ట ద్రవరూపంలో ఉంటుంది కాబట్టి శరీరం తేలికగా గ్రహించగలుగుతుంది. తద్వారా త్వరగా ఉపశమనం కలుగుతుంది. రోగి అవసరం, శరీర తత్వాన్ని బట్టి అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ చూర్ణం ఉపయోగిస్తారు. అశ్వగంధ ఉపయోగాల గురించి ఆయుర్వేద గ్రంథాలైన బైషజ్య రత్నావళి, శార్గ్జధర సంహిత, బసవరాజీయం, సహస్రయోగ, చక్రదత్త మొదలైన గ్రంఽథాలలో వివరంగా ఉంది. 


అశ్వగంధ విశేషాలు...

మానసిక సమస్యల్లో ఒకటైన మూర్ఖత్వం, ఏదైనా ఒక విషయం కావాలని పట్టుబట్టి మరేదీ ఒప్పుకోలేని మొండితనం సమస్య నుంచి అశ్వగంధ వాడకం ద్వారా బయటపడవచ్చు. అలాగే ఆటిజం అనే బుద్ధిమాంద్యం, నిద్రలేమికీ అశ్వగంధ బాగా పనిచేస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని నమ్మి వేరే విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఉండే మానసిక సంఘర్షణ నుంచి బయటపడడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. చుట్టూ ఉండే పరిస్థితులను అంగీకరించకుండా ఏదో ఒక దానిలోనే ఉండిపోయిన మానసిక సమస్యలకు అశ్వగంధారిష్ట అనుపానంగా బాగా పనిచేస్తుంది. 

మానసిక నిబ్బరాన్ని కోల్పోయి ప్రతి చిన్న విషయానికీ త్వరగా కోప్పడడం, బాధపడడం, ఆందోళనపడడం, ఆనందపడడం... ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. 


 జి. శశిధర్‌

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల.


Updated Date - 2020-12-29T05:52:18+05:30 IST