Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాక్ పేసర్ షహీన్ అఫ్రిదిని వెనక్కి నెట్టేసిన అశ్విన్

కాన్పూరు: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూకుడు కొనసాగిస్తున్నాడు. కాన్పూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన అశ్విన్ ఒకే కేలండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది రికార్డును బద్దలుగొట్టాడు. మొత్తం 41 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 


న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ వికెట్‌ను తీయడంతోనే అశ్విన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, పాకిస్థాన్‌కే చెందిన దిగ్గజ బౌలర్ వసీం అక్రం రికార్డును కూడా అశ్విన్ బద్దలుగొట్టాడు. కైలీ జెమీసన్ వికెట్‌ను పడగొట్టిన అశ్విన్..  80 టెస్టుల్లో మొత్తంగా 415 వికెట్లు సాధించాడు. దీంతో  ఈ జాబితాలో 414 వికెట్లతో ఉన్న అక్రమ్ రికార్డు బద్దలైంది. 


2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన అశ్విన్ 30 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు, ఇందులో ఏడుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసుకొచ్చాడు. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో తనకంటే పైన ఉన్న వారికంటే అశ్విన్ బౌలింగ్ సగటు మెరుగ్గా ఉండడం గమనార్హం. 

Advertisement
Advertisement