Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోహిత్‌పై అశ్విన్ ట్వీట్.. అవుట్ కావడంతో దిష్టి తగిలిందంటూ డిలీట్

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో మూడో వన్డే జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ట్వీట్ చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ గురించి ఈ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, అలాగే వన్డేల్లో 400పైగా పరుగులు ఒక్కసారి మాత్రమే ఛేజ్ చేయడం జరిగింది’ అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అయితే అశ్విన్ ఆ ట్వీట్ చేసే సమయానికి మూడో వన్డేలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ కొద్ది సేపటికే 37 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో ఆ ట్వీట్‌ను తొలగించిన అశ్విన్.. రోహిత్‌కు తన దిష్టి తగిలిందంటూ మరో ట్వీట్ చేశాడు. తొలగించాడు.


Advertisement
Advertisement