దిగ్గజ ఆల్‌రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును సమం చేసిన అశ్విన్

ABN , First Publish Date - 2021-12-06T02:59:42+05:30 IST

న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో వికెట్ల వేటలో విజృంభిస్తున్న ..

దిగ్గజ ఆల్‌రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును సమం చేసిన అశ్విన్

ముంబై: న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో వికెట్ల వేటలో విజృంభిస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి రికార్డులు వచ్చి చేరుతున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడింటిని తన ఖాతాలోనే వేసుకున్న అశ్విన్.. 50 వికెట్లతో ఈ ఏడాది అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.


అలాగే, ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించడం అశ్విన్‌కు ఇది నాలుగోసారి. గతంలో 2015, 2016, 2017లలో వరుసగా 50కిపైగా వికెట్లు సాధించాడు. తాజాగా మరోమారు ఆ ఘనత సాధించాడు.  


ఇక అన్నింటికంటే ముఖ్యమైన మరో రికార్డును కూడా అశ్విన్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్‌‌ను అవుట్ చేసిన అశ్విన్.. దిగ్గజ ఆల్ రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును సమం చేశాడు. భారత్-న్యూజిలాండ్ ముఖాముఖి తలపడిన టెస్టుల్లో అశ్విన్‌కు ఇది 65వ వికెట్. అశ్విన్ 17 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధిస్తే, హ్యాడ్లీ 24 ఇన్నింగ్స్‌లలో 65 వికెట్లు పడగొట్టాడు.  

Updated Date - 2021-12-06T02:59:42+05:30 IST