Abn logo
Apr 3 2020 @ 03:38AM

ఐసోలేషన్‌లో ఏఎస్సై

  • పది రోజులుగా మహారాష్ట్ర సరిహద్దులో విఽధులు
  • జ్వరం, జలుబు రావడంతో ఆసుపత్రికి తరలింపు

బాసర, ఏప్రిల్‌2: బాసర పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై జ్వరం, జలుబు బారిన పడడంతో గురువారం ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాసర మండ లం బిదరెల్లి గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఆ ఏఎస్సై గత పది రోజుల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాడు. మహారాష్ట్ర నుంచి వాహనాలను, ప్రజలను తెలంగాణకు రాకుండా చర్యలు తీసుకున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి పంపించారు. జ్వరం తగ్గకపోవడంతో పాటు జలుబు వంటివి ఉండడంతో ఆసుపత్రికి వెళ్లిన ఆయనను ఐసోలేషన్‌లో ఉంచారు. రిపోర్టు వస్తేకాని సాధారణ జ్వరమా కదా అనేది తేలనుంది. ఈ విషయమై బాసర ఎస్సై రాజును సంప్రదించగా బార్డర్‌లో ఉండే ఏఎస్సైకి జ్వరం రావడంతో ఉన్నతాధికారుల సూ చన మేరకు నిజామాబాద్‌లో ఉండే ఆయన ఇంటికి పంపినట్లు తెలిపారు. ప్ర స్తుతం ఆయన నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement