మనీష్ కు టోక్యో బెర్త్‌

ABN , First Publish Date - 2020-03-12T10:07:30+05:30 IST

భారత బాక్సర్‌ మనీష్‌ కౌశిక్‌ (63 కిలోలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా

మనీష్ కు టోక్యో బెర్త్‌

వికాస్ కు రజతం

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ 


అమ్మాన్‌ (జోర్డాన్‌): భారత బాక్సర్‌ మనీష్‌ కౌశిక్‌ (63 కిలోలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం జరిగిన బాక్సాఫ్‌ బౌట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత మనీష్‌ 4-1తో ఆస్ట్రేలియాకు చెందిన రెండోసీడ్‌ హారిసన్‌ గార్సిదెను చిత్తుచేశాడు. ఈ ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు బెర్త్‌ దక్కించుకున్నాడు. కాగా.. 69 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన భారత స్టార్‌ వికాస్‌ క్రిషన్‌ రజతంతో సంతృప్తిపడ్డాడు. సెమీస్‌ బౌట్‌ సందర్భంగా కంటికి గాయమవడంతో వికాస్‌ ఫైనల్‌ బౌట్‌ నుంచి వైదొలిగాడు. భారత్‌ నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొమ్మిదో బాక్సర్‌ మనీష్‌. ఇప్పటికే మేరీకోమ్‌ (51 కి), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కి), లవ్లీనా (69 కి), పూజారాణి (75 కి), అమిత్‌ (52 కి), వికాస్‌ (69 కి), ఆశిష్‌ (75 కి), సతీష్‌ (+91 కి) టోక్యో టికెట్‌ దక్కించుకున్నారు. ఇంతమంది విశ్వక్రీడల్లో పోటీపడనుండడం భారత బాక్సింగ్‌ చరిత్రలో ఇదే తొలిసారి. భారత యువ జావెలిన్‌ త్రోయర్‌ శివ్‌పాల్‌ సింగ్‌ కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దక్షిణాఫ్రికాలోని పోచె్‌ఫస్ర్టూమ్‌లో జరిగిన అథ్లెటిక్‌ ఈవెంట్‌లో జావెలిన్‌ను 85.45 మీటర్ల దూరం విసిరిన శివ్‌పాల్‌ ఒలింపిక్‌ మార్క్‌ను అందుకున్నాడు.  

Updated Date - 2020-03-12T10:07:30+05:30 IST