Jun 14 2021 @ 01:56AM

కథక్‌ ప్రాక్టీ్‌సలో అసిన్‌ కుమార్తె!

అసిన్‌ గుర్తున్నారా? ‘లక్ష్మీ నరసింహా’, ‘ఘర్షణ’, ‘గజిని’ చిత్రాల్లో నటించిన కథానాయిక! రాహుల్‌ శర్మతో పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యారు. కానీ, కళకు దూరం కాలేదు. మూడేళ్ల కుమార్తె అరిన్‌కు కథక్‌ నేర్పిస్తున్నారు. ‘‘వారాంతంలో కథక్‌ ప్రాక్టీస్‌’’ అంటూ కుమార్తె ఫొటోను ఇన్‌స్టా స్టోరీ్‌సలో పోస్ట్‌ చేశారు. చిన్నతనం నుంచి అమ్మాయికి నృత్యం నేర్పిస్తున్నారు. బహుశా... భవిష్యత్‌లో ఆమెను హీరోయిన్‌ చేసే ఆలోచనలు ఉన్నాయేమో!