Advertisement
Advertisement
Abn logo
Advertisement

1,027 మంది ప్రజాప్రతినిధులను కోరుతున్నా

విలేకరులతో మాట్లాడుతున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పక్కన ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మలారెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలారెడ్డిని గెలిపించండి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి 


సంగారెడ్డిటౌన్‌, నవంబరు 30 : శాసనమండలి ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గంలోని ఓటర్లయిన 1,027 మంది ప్రజాప్రతినిధులను కోరుతున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేస్తున్న నిర్మలారెడ్డిని గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఓ హోటల్‌లో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటర్లయిన 230 మందితో పాటు మిగిలిన టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీల ఓటర్లందరూ కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలారెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిర్మలారెడ్డిని పోటీలో ఉంచడం వల్లే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు విలువ, గౌరవం పెరిగిందన్నారు. ఎన్నికల ముందు వరకు కనీసం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులనైనా పట్టించుకోని మంత్రి హరీశ్‌రావు తాము అభ్యర్థిని పోటీకి పెట్టడంతో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. తాము అభ్యర్థిని పోటీలో ఉంచడం వల్లే టీఆర్‌ఎస్‌ నాయకత్వం భయపడి ఆ పార్టీ ప్రతినిధులను క్యాంపులకు తరలిస్తున్నదని తెలిపారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులందరూ గుర్తుంచుకుని తమకు సహకరించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు సీనియర్‌ నాయకులైన సురే్‌షషెట్కార్‌, సంజీవరెడ్డి, మదన్‌మోహన్‌రావు, శంకర్‌యాదవ్‌, గాలి అనిల్‌కుమార్‌, కాట శ్రీనివా్‌సగౌడ్‌, సపానదేవ్‌, శశికళయాదవరెడ్డి, గిరిధర్‌రెడ్డి, దుబ్బాక శ్రీనివా్‌సరెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, నర్సారెడ్డి సహకారంతో తాము ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్మలా రెడ్డిని నిలబెట్టామన్నారు. జిల్లాలో క్యాడర్‌, లీడర్‌ పరంగా బలంగా ఉన్న కాంగ్రెస్‌ ఉనికిని కాపాడుకోవడం కోసమే పోటీలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రె్‌సకు 8 స్థానాలు, టీఆర్‌ఎ్‌సకు రెండు స్థానాలు ఉండేవని, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సంఖ్య పునరావృతం కానున్నదని జగ్గారెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులూ లేవని, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు చెందిన 230 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలారెడ్డికే ఓటేస్తారని విశ్వాసంతో ఉన్నానని, ఒక్క ఓటు తగ్గినా తనదే నైతిక బాధ్యత అని జగ్గారెడ్డి అన్నారు. 


కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తేనే నిధులు, పవర్‌

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలారెడ్డిని గెలిపిస్తే సీఎం కేసీఆర్‌లో మార్పు వస్తుందని జగ్గారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ పొలిటికల్‌ పవర్‌ ఇవ్వడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ గతంలో అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. జడ్పీచైర్మన్లు అందరూ డమ్మీలుగా మారారని, అధికారులందరూ మంత్రుల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని, స్థానిక సంస్థలైన ఎంపీపీ, జడ్పీపీ సమావేశాలు కూడా చాయ్‌ బిస్కెట్లతో సరిపెడుతున్నారన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మలారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement