Jul 30 2021 @ 06:06AM

అభిలాషలో చిరంజీవిని తలపిస్తుంది

‘తిమ్మరుసు’ చిత్రంలో న్యాయవ్యవస్థలో సామాన్యుడికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే లాయరు పాత్రలో కనిపిస్తాను. ‘అభిలాష’ చిత్రంలో చిరంజీవి గారి పాత్ర తరహాలో ఉంటుంది’’ అని కథానాయకుడు సత్యదేవ్‌ అన్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘తిమ్మరుసు’ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో కోర్ట్‌ రూమ్‌ డ్రామాతో పాటు యాక్షన్‌ పార్ట్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. సామాన్యుడికి న్యాయం జరగాలని కోరుకునే లాయరు, తాను వాదించే కేసును ఎలా గెలిచాడు. దానికోసం ఎలాంటి  పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది సినిమా కథ. భారతీయ శిక్షాస్మృతిలో యావజ్జీవ కారాగార శిక్షకు సంబంధించిన చట్టాల్లోని లోపాలపై నా పాత్ర పోరాడుతుంది. 


‘గుర్తుందా శీతాకాలం’ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం. కాలేజీ ప్రేమ నేపథ్యంలో సాగుతుంది. ‘స్కైలాబ్‌’లో వైద్యుడిగా కనిపిస్తాను. ‘గాడ్సే’ వినూత్న కథాంశంతో తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ చిత్రం ‘రామ్‌సేతు’లో కీలకపాత్రలో కనిపిస్తాను’’ అని చెప్పారు.