అసోం పడవ ప్రమాదంలో ఒక మహిళ మృతదేహం వెలికితీత... కొనసాగుతున్న గాలింపు చర్యలు

ABN , First Publish Date - 2021-09-09T17:56:01+05:30 IST

అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో ఘోర...

అసోం పడవ ప్రమాదంలో ఒక మహిళ మృతదేహం వెలికితీత... కొనసాగుతున్న గాలింపు చర్యలు

డిస్పూర్: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 120 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ.. ఒక ప్రభుత్వ స్టీమర్‌ను ఢీకొని నీట మునిగిపోయింది. జోర్హాత్‌ జిల్లాలో గల నీమతి ఘాట్‌ వద్ద బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 


ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. నదిలో 70 మంది వరకూ గల్లంతయినట్లు గుర్తించామని, వారిలో ఇప్పటివరకూ 50 మందిని రక్షించామని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం డిప్యూటీ కమాండర్‌ శ్రీవాస్తవ మీడియాకు వివరించారు. కాగా ఈ ఘటనపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను సంప్రదించి, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-09-09T17:56:01+05:30 IST