Abn logo
Aug 1 2021 @ 19:50PM

బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ నేత

గువాహటి: కొద్ది సేపటి క్రితమే మణిపూర్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గోవిందాస్ కొంతౌజమ్ అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. కాగా ఇది జరిగిన కొద్ది సమయానికే అస్సాం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరారు. అస్సాంలోని తోవ్రా అనే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుశాంత బోర్గోహెయిన్ అనే ఎమ్మెల్యే ఆదివారం గువాహటిలోని బీజేపీ కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.


రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుశాంతా బోర్గోహెయిన్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. పార్టీలో అంతర్గత కార్యకలాపాలు ఏవో చేస్తున్నారని ఆయనకు పార్టీ నుంచి శుక్రవారం షోకాజ్ నోటీసు వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ముందు నుంచి ఉన్న ఊహాగాణాల ప్రకారమే.. ఆయన కమలం పార్టీలో చేరిపోయారు.