Coronavirus: మహిళా డాక్టర్‌కు సోకిన రెండు వేరియంట్లు... ఆసుపత్రికి వెళ్లకుండానే చికిత్స!

ABN , First Publish Date - 2021-07-21T15:57:05+05:30 IST

అసోంనకు చెందిన ఒక మహిళా డాక్టర్‌కు ఒకేసారి...

Coronavirus: మహిళా డాక్టర్‌కు సోకిన రెండు వేరియంట్లు... ఆసుపత్రికి వెళ్లకుండానే చికిత్స!

డుబ్రిగఢ్: అసోంనకు చెందిన ఒక మహిళా డాక్టర్‌కు ఒకేసారి కరోనా వైరస్‌కు చెందిన రెండు వేరియంట్లు సోకాయి. దేశంలో ఇటువంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీ బొర్కాకోటి ఈ విషయాన్ని తెలిపారు. రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న తరువాత కూడా ఆ మహిళా డాక్టర్‌కు వైరస్ వేరియంట్లు ఆల్ఫా, డేటా సోకినట్లు వైద్యులు గుర్తించారు.


ఈ సందర్భంగా డాక్టర్ బీ బొర్కాకోటి మాట్లాడుతూ ఈ విధంగా రెండు వేరియంట్లు ఒక వ్యక్తికి సోకిన కేసులు బ్రిటన్, బ్రెజిల్, పోర్చుగల్‌లో నమోదయ్యాయని, అయితే ఇటువంటి కేసు భారత్‌లో నమోదవడం ఇదే తొలిసారన్నారు. రెండు డోసుల టీకా తీసుకున్న నెల రోజుల తరువాత ఆ మహిళా డాక్టర్‌కు తిరిగి కరోనా వేరియంట్లు సోకాయన్నారు. ఆమె భర్తకు కరోనా వైరస్ కు చెందిన అల్ఫా వేరియంట్ సోకిందని తెలిపారు. ఈ వైద్య దంపతుల జంట కోవిడ్ సెంటర్‌లో విధులు నిర్వహించారన్నారు. అయితే వీరిద్దరికీ స్వల్ప లక్షణాలే ఉన్నాయని, అందుకే వీరు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్ప పొందచ్చని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్ బొర్కాకోటి తెలిపారు. 

Updated Date - 2021-07-21T15:57:05+05:30 IST