Abn logo
Sep 27 2021 @ 09:33AM

ప్రధాని మోదీకి.. ముఖ్యమంత్రికి లేఖలు రాసిన ఇద్దరు పిల్లలు.. అందులో విషయం చదివి నోరెళ్లబెడుతున్న అధికారులు

అసోంనకు చెందిన ఇద్దరు అక్కాతమ్ముళ్లు ప్రధాని మోదీకి, అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాకు ఒక లేఖ రాశారు. ఎంతో ఆసక్తి గొలుపుతున్న ఈ లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆరేళ్ల రవ్జా, ఆమె ఐదేళ్ల తమ్ముడు ఆర్యన్ మంత్రులకు విడివిడిగా లేఖలు రాస్తూ, తమ వయసువారి దంత సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. దంత సమస్యల కారణంగా తాము తమకు ఇష్టమైన పదార్థాలను నమిలి తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ వయసులో ఉన్నవారి దంతాలు ఊడిపోయాక, తిరిగి అవి వచ్చేందుకు చాలా సమయం పడుతున్నదని, దీంతో తాము ఆహారం తినేందుకు ఇబ్బందిగా ఉందని, ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ నేతలకు ఈ సమస్య గురించి తెలియజేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ చిన్నారులు రాసిన లేఖను వారి మామ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది వైరల్‌గామారి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టు చేసిన ఆ చిన్నారుల మామ... ‘హిమంత్ బిశ్వా శర్మ, నరేంద్ర మోదీలను ఉద్దేశిస్తూ... నా మేనకోడలు రవ్జా, మేనల్లుడు ఆర్యన్‌లు స్వయంగా ఈ లేఖ రాశారు. అందుకే వారి దంత సమస్యలను పరిష్కరించండి. వారు వారికి ఇష్టమైనవేవీ తినలేకపోతున్నారు’ అని రాశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...