Abn logo
Sep 23 2021 @ 19:37PM

అసోం దరాంగ్‌ జిల్లాలో రణరంగం

అసోం: దరాంగ్‌ జిల్లా ధోల్పూర్‌ రణరంగంగా మారింది. ఇళ్ల కూల్చివేతపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పోలీసులపై తిరగబడ్డారు. రాళ్ల దాడి చేశారు. దీంతో  స్థానికులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇదే ఘటనలో 9 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని 20 ఏళ్లుగా స్థానికులు ఆక్రమించారు. ఆక్రమించిన వారి ఇళ్ల కూల్చివేతకు పోలీసులు వెళ్లారు. స్వాధీనం చేసుకునే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం నుంచి ఆక్రమణలను పోలీసులు కూల్చివేస్తున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption