ఇరాన్‌ కీలక అణు శాస్త్రవేత్త హత్య

ABN , First Publish Date - 2020-11-28T08:01:09+05:30 IST

ఇరాన్‌ కీలక అణు శాస్త్రవేత్త మొహసెన్‌ ఫఖ్రిజాదెహ్‌ హత్యకు గురయ్యారు. టెహ్రాన్‌ శివారులో ఫఖ్రిజాదెహ్‌ కారుపై కొందరు బాంబులు వేసి కాల్పులకు తెగబడ్డారు

ఇరాన్‌ కీలక అణు శాస్త్రవేత్త హత్య

ఇజ్రాయెల్‌పై అనుమానాలు


టెహ్రాన్‌, నవంబరు 27: ఇరాన్‌ కీలక అణు శాస్త్రవేత్త మొహసెన్‌ ఫఖ్రిజాదెహ్‌ హత్యకు గురయ్యారు. టెహ్రాన్‌ శివారులో ఫఖ్రిజాదెహ్‌ కారుపై కొందరు బాంబులు వేసి కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో శాస్త్రవేత్త సహా కారు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. గతంలోనూ ఆయనపై పలుసార్లు హత్యాయత్నాలు జరిగినా.. తప్పించుకున్నారు. ఫఖ్రిజాదె్‌హను ప్రశ్నిస్తామని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కోరినా ఇరాన్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ఈయన ఆస్తులను ఐరాస భద్రతామండలి స్తంభింపజేసింది. ఈ హత్య ఇజ్రాయిల్‌ పనేనని ఇరాన్‌ ఆరోపించింది. 

Updated Date - 2020-11-28T08:01:09+05:30 IST