సీఎం జగన పాలనలో హత్యా రాజకీయాలు : ఉన్నం

ABN , First Publish Date - 2022-01-15T05:54:51+05:30 IST

సీఎం జగన పాలనలో హత్యారాజకీయాలకు బీ జం ఏర్పడుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి వి మర్శించారు.

సీఎం జగన పాలనలో హత్యా రాజకీయాలు : ఉన్నం
విలేకరులతో మాట్లాడుతున్న ఉన్నం హనుమంతరాయచౌదరి

కళ్యాణదుర్గం, జనవరి 14: సీఎం జగన పాలనలో హత్యారాజకీయాలకు బీ జం ఏర్పడుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి వి మర్శించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుడు తోటచంద్రయ్యను వైసీపీ నా యకులు అతికిరాతంగా హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో నాయకులు దండా వెంకటేశులు, మారుతిచౌదరి, డీకే రామాంజనేయులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఆరంభం నుంచి అరాచకాలే కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చే శారు. రెండున్నరేళ్ల పాలనలో సుమారు 33 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారన్నారు. ప్రతిపక్షాన్ని అంతమొందించేందుకు నాయకులపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపారని వాపోయారు. రోజురోజుకు గ్రామాల్లో ఫాక్షనిజం పెరిగిపోతోందని, అడ్డకట్టవేయాల్సిన పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల హత్యలకు ప్రభుత్వమే బా ధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ పాలనలో సామాన్యులు, టీడీపీ కా ర్యకర్తలు, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీస్‌ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ప్రజా పరిరక్షణను గాలికి వదిలారని ఆరోపించారు. టీడీపీ పాలనలో ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నడూ జరగలేదన్నారు.  భవిష్యత్తులో వైసీపీ నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు గోవిందరెడ్డి, ఆదెప్ప, ఓబులేష్‌, హనుమప్ప, షామీర్‌, మునీర్‌, నారాయణస్వామి, తిమ్మారెడ్డి, నాగన్న, సురేష్‌ పాల్గొన్నారు. 


రాష్ట్రంలో రాక్షస పాలన : ఉమా :

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యను వైసీపీ నాయకులు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన వైసీపీ అరాచకపాలన.. హత్యలు, దోపిడీ, మానభంగాలు, హత్యాచారాలతో రాష్ట్రం పెట్రేగిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్‌ యంత్రాంగం కూడా అధికారపార్టీకి కొమ్ముకాయడం అప్రజాస్వామికమన్నారు. వైసీపీ నాయకుల అరాచకాలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


Updated Date - 2022-01-15T05:54:51+05:30 IST