అసెంబ్లీ ఘటనను సమర్థించడం లేదు

ABN , First Publish Date - 2021-11-28T07:33:40+05:30 IST

అసెంబ్లీ ఘటనను సమర్థించడం లేదు

అసెంబ్లీ ఘటనను సమర్థించడం లేదు

పక్కన ఎవరో చేసిన కామెంట్‌ కౌంట్‌ కాదు

దానికి వత్తాసు పలకడం లేదు

అసెంబ్లీలో అసభ్య వ్యాఖ్యలపై మంత్రి బొత్స పరోక్ష అంగీకారం


అనంతపురం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ పరోక్షంగా అంగీకరించారు. అనంతపురం జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాలపై సమీక్షించేందుకు శనివారం ఆయన జిల్లాకొచ్చారు. సమీక్ష అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘అసెంబ్లీలో జరిగిన ఘటనను సమర్థించడం లేదు. అదే సందర్భంలో తమకు నోరుందనీ, తాము చెప్పిందే వినాలనే పద్ధతిని ప్రతిపక్షాలు వీడాలి. ఇంత వరకూ నేనెప్పుడూ గట్టిగా మాట్లాడలేదు. అందర్నీ ఒకే గాటికి కడితే ఎలా? నేనూ ఆ రోజు శాసనసభలో ఉన్నా. సభలో మాట్లాడితే ప్రతీది రికార్డు అవుతుందన్న విషయం చంద్రబాబుకు తెలుసు. పక్కనుంచి ఎవరో వచ్చి కామెంట్‌ చేస్తే అది కౌంట్‌ అవుతుందా? దానికి వత్తాసు పలకడం లేదు. పక్కనున్న వాళ్లు కామెంట్‌ చేసిన దానికి నేనుగానీ, స్పీకర్‌ గానీ ఎలా బాధ్యులమవుతాం?’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదైనా సమస్య తలెత్తినపుడు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చంద్రబాబు తమ పార్టీ నాయకులను కించపరిచిన సందర్భాలు లేకపోలే దన్నారు. ‘‘ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు నిర్వహించడమేంటి? ఆడపడు చులకు ఇప్పుడేమైంది? ఆడవాళ్లేంటి? ఆత్మగౌరవమేంటీ? మాకంటే ఆడవాళ్ల ను గౌరవంగా చూసేవాళ్లు ఎవరున్నారు? మా ముఖ్యమంత్రికంటే మహిళల కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు మరొకరు లేరు. 40 ఏళ్ల రాజకీ య చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి ఉద్యమాలు, సభలు పెట్టుకుంటే పెట్టికోనీ. తీర్పిచ్చేది ప్రజలే. మేమెప్పుడూ ప్రజల తీర్పునకు సిద్ధంగానే ఉన్నాం’’ అని మంత్రి బొత్స అన్నారు. 

Updated Date - 2021-11-28T07:33:40+05:30 IST