Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండు కీలక బిల్లులను ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

అమరావతి: రెండు కీలక బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులకు ఆమోదించారు. ఇకపై సినిమా టికెట్లను  ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శించేందుకు నిబంధనలతో కొత్త చట్టం తేనున్నారు. బెనిఫిట్‌ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేయనున్నారు. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్‌లలో పెంపుదల చేస్తూ సవరించారు. కొత్త వాహనాలకు 1 శాతం నుంచి 4 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ పెంచారు. దీంతో రాష్ట్ర ప్రజలపై 409 కోట్ల అదనపు భారం పడనుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాత వాహనాలను నిరుత్సాహ పరిచేందుకు 4 వేల నుంచి 6 వేల వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధిస్తున్నట్లు చెబుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పసరి చేస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్ ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశ పెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్ లో ఇకనుంచి టికెటింగ్ కు అనుమతి లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తరపున బిల్లును ప్రవేశపెడుతూ.. రాష్ట్ర సమాచార ప్రజాసంబంధాల శాఖామాత్యులు పేర్ని నాని బిల్లు లక్ష్యాల్ని, ప్రకటనను చదివి వినిపించారు.

Advertisement
Advertisement