పంట నష్టం అంచనా వేస్తున్నాం: వరంగల్ కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-12T22:44:36+05:30 IST

జిల్లాలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్‌

పంట నష్టం అంచనా వేస్తున్నాం: వరంగల్ కలెక్టర్‌

వరంగల్: జిల్లాలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్‌ గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటనష్టం అంచనా వేస్తున్నామన్నారు. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, ఖానాపురం మండలాల్లో వడగళ్ల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయన్నారు. 


వరంగల్‌ జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిదే. ఈదురు గాలులతో వాన పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. రాళ్లవానతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దుగ్గొండి, పర్వతగిరి, చెన్నారావుపేట, ఖానాపురం, తదితర మండలాల్లో భారీ వడగళ్ల వర్షం కురిసింది. 

Updated Date - 2022-01-12T22:44:36+05:30 IST