రూ.10,000 కోట్ల ఆస్తుల నిర్వహణ

ABN , First Publish Date - 2021-01-17T06:42:28+05:30 IST

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఓఎ్‌ఫ)కు మంచి ఆదరణ లభిస్తోందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది.

రూ.10,000 కోట్ల ఆస్తుల నిర్వహణ

ఐసీఐసీఐ ప్రు అసెట్‌ అలోకేటర్‌ ఫండ్‌ వెల్లడి 


మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఓఎ్‌ఫ)కు మంచి ఆదరణ లభిస్తోందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. అంతేకాకుండా ఈక్విటీ, డెట్‌, బంగారం ఈటీఎఫ్‌ వంటి విభాగాల్లో పెట్టిన పెట్టుబడులకు మంచి రిటర్నులను అందిస్తున్నాయని తెలిపింది.

ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ అలోకేటర్‌ ఫండ్‌ నిలిచిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పేర్కొంది. ఈ ఫండ్‌ ప్రారంభించిన రెండేళ్ల వ్యవధిలోనే ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) రూ.10,000 కోట్లకు చేరుకుందని తెలిపింది.


2019 ఫిబ్రవరిలో రూ.18 కోట్ల ఏయూఎంతో ప్రారంభమైన ఈ అలోకేటర్‌ ఫండ్‌ ఆస్తుల నిర్వహణ 2020 డిసెంబరు నాటికి రూ.9,000 కోట్లకు చేరుకుంది. తక్కువలో కొనుగోలు.. గరిష్ఠ ధరలో విక్రయం అనే సూత్రాన్ని పాటిస్తూ ఈ ఫండ్‌ భిన్న విభాగాల్లో పెడుతూ వస్తోందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పేర్కొంది.

అంతేకాకుండా పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఇన్వెస్టర్లను లాభాలను అందిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే సగటున 12.7 శాతం రిటర్నులను అందించినట్లు పేర్కొంది. 


Updated Date - 2021-01-17T06:42:28+05:30 IST