గాడితప్పిన వ్యవసాయ శాఖ

ABN , First Publish Date - 2021-07-23T06:54:00+05:30 IST

మండల వ్యవసాయాధికారులు సమయ పా లన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు.

గాడితప్పిన వ్యవసాయ శాఖ
వజ్రకరూరులో ఉదయం 11 గంటలైనా తెరచుకోని వ్యవసాయ శాఖ కార్యాలయం

ఇష్టారాజ్యంగా విధులకు హాజరు

ఆర్బీకేల్లోనూ అదే తీరు..


వజ్రకరూరు, జూలై 22: మండల వ్యవసాయాధికారులు సమయ పా లన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం సీహెచసీల ద్వారా వ్యవసాయ యంత్రాలను అందించే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం కా ర్యాయాలకు వచ్చే సీహెచసీ గ్రూపు సభ్యులకు సమాచారమిచ్చేవారు లేక ప్రదక్షిణలు చేస్తున్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు మండల అధికారులను చూసి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వహించే వీఏఏలు కూడా అదేదారి పట్టారు. తమకు ఇష్టం వచ్చినప్పుడు విధులకు  హాజరవుతూ రైతులు పడిగాపులు కాచేలా వ్యవహరిస్తున్నారు. గూళ్యపా ళ్యం గ్రామానికి చెందిన వీఏఏపై రైతులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ప్రవర్తనలో మార్పు రావడం లేదు. సాగుచేసిన పంటల వివరాలను ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన చేయించుకోవాలి.దీని కోసం ఒక్కొక్క రైతుకు సుమారు 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతుం ది. దీని తరువాత వీఏఏలు రైతుల పొలాలకు వెళ్లి ఈ-క్రాప్‌ చేయాల్సి ఉంటుంది. అయితే సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం తో రైతుల పంట వివరాలు రిజిస్ట్రేషన చేయించకపోతున్నారు. దీంతో ప్ర భుత్వ రాయితీలు అందవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇ ప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 


 ఈ విషయంపై ఏఓ వెంకటరమణను వివరణ కోరగా, ఏఈఓ రియాజ్‌ ఐదు రోజులుగా విధులకు హాజరుకావడం లేదన్నారు. ఆర్బీకేల నిర్వహణపై తనకు ఫిర్యాదు అందిందన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-07-23T06:54:00+05:30 IST