Abn logo
Sep 25 2021 @ 00:27AM

ప్రభుత్వ భూములు అప్పగించండి

ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌

సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌

పలాస : ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు తక్షణం అప్పగించాలని, లేకుంటే చర్యలు తప్పవని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ హెచ్చరించారు. శుక్రవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి పద్మనాభపురం సమీపంలో సర్వే నెంబరు 362/5లో ఉన్న 2.31 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, పోలీసులు, మునిసిపల్‌ సిబ్బందితో వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. కంచె వేసిన ఈ స్థలాన్ని ఎక్స్‌కవేటర్‌ సాయం తో తొలగించి రెవెన్యూశాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ... చాలా ప్రభుత్వ భూమి ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉందన్నారు. వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుంటా మన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎల్‌.మధుసూధనరావు, మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాల రావు, సీఐ ఎస్‌.శంకరరావు తదితరులు ఉన్నారు.