కరోనా బాధితులకు సాయం

ABN , First Publish Date - 2022-01-23T05:37:34+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరో నా అనేక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో కుటుంబాలను రోడ్డు న పడేసింది.

కరోనా బాధితులకు సాయం

జిల్లాలో 897 మంది మృతుల కుటుంబాలకు అందజేత

రాష్ట్ర విపత్తు నిధి నుంచి రూ. 4.48 కోట్ల నిధుల జమ

జగిత్యాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరో నా అనేక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో కుటుంబాలను రోడ్డు న పడేసింది. అయిన వారందరినీ కరోనా పొట్టన పెట్టుకుంది. మరెందరో అనాథలుగా మారిన సంఘటనలు కోకొల్లలు. కొవిడ్‌తో కొందరు కో లుకున్నా ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు తీరని వేదన మిగిల్చారు. అలాంటి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నా యి. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందజేస్తుంది. ఇప్పటికే జిల్లాలో బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో అర్హులైన వారిని ఎంపిక చేసిం ది. బాధిత కుటుంబాల సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లో సాయం జమ చేస్తోం ది. ప్రభుత్వ సాయంతో బాధిత కుటుంబాలకు కాసింత ఊరట లభి స్తోంది. జిల్లాలో ఇప్పటివరకు విపత్తు సాయం కోసం దరఖాస్తులు చే సుకున్న వాటిలో అర్హులుగా తేల్చిన 897 కుటుంబ సభ్యులకు సాయం అందజేశారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

జిల్లాలో 1,176 దరఖాస్తులు...

జగిత్యాల జిల్లాలో బాధిత కుటుంబాల నుంచి వైద్య ఆరోగ్య శాఖ అ ధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 1,176 మంది మృతుల కుటుంబ సభ్యులు కొవిడ్‌ పరిహారం కోసం దరఖాస్తులు చేసుకున్నారు ఇందులో 897 దరఖాస్తులు అర్హత ఉన్నవిగా తేల్చి బాధిత కుటుంబ స భ్యుల బ్యాంకు ఖాతాల్లో విపత్తు సాయం సొమ్ములను జమ చేశారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో సంబంధిత దరఖాస్తులను పరిశీలించారు.

మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు...

కొవిడ్‌ వల్ల మృతి చెందినట్లు అధికారికంగా దృవీకరణ పత్రం జారీ చేయడానికి త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ అధ్యక్షుడిగా, జి ల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆయా ఆసుపత్రుల కో ఆర్డినేటర్లు సభ్యు లుగా ఉంటున్నారు. విపత్తు సాయం కోరుతూ బాధిత కుటుంబాలు మీ సేవ కేంద్రాల ద్వారా కలెక్టరుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. వాటిని త్రిసభ్య కమిటీ పరిశీలించి అర్హులను గుర్తిస్తుంది. విప త్తు నిర్వహణ పరిహారాన్ని దరఖాస్తు దారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. 

దరఖాస్తుతో కావాల్సినవి.. 

మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో కలెక్టరుకు దరఖాస్తులను సమ ర్పించాలి. మీ సేవా కేంద్రానికి వెళ్లేటప్పుడు కొవిడ్‌ సోకి మరణించిన వ్య క్తి ఆధార్‌ కార్డు, మరణ దృవీకరణ పత్రం, కొవిడ్‌ నిర్ధారణ నివేదిక, నా మిని ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా పత్రాలు, రేషన్‌ కార్డు, పరీక్షలు, చికి త్స చేయించుకున్న ఆసుపత్రి రిపోర్టు తీసుకవెళ్లాలి. దరఖాస్తు అనంతరం అధికారులు పరిశీలించి విచారణ జరిపి ఎలాంటి లోపాలు లేకుంటే పరిహారం బాధిత కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. కొవి డ్‌ సోకిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదాల బారిన పడి మృ తి చెందినా ఇది వర్తించదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కొవి డ్‌ సోకిన దృవపత్రం కలిగి ఉండి ఇంటి వద్దే చికిత్స పొందుతూ మర ణించిన వారి కుటుంబాలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రభు త్వం గుర్తిస్తుంది.


తిరస్కరణకు గురైతే మళ్లీ ..

కరోనా మృతుల కుటుంబాలకు సహాయం అందజేసేందుకు  ప్రభు త్వం సూచించిన అన్ని పత్రాలున్న 897 అర్హతగా తేల్చారు. వీరికి సు మారు రూ. 4.48 కోట్ల నగదును బ్యాంకు ఖాతాల ద్వారా అందించారు. సరియైన దృవపత్రాలు సమర్పించని కారణంగా కొన్ని తిరస్కరించారు. ఇంకా 279 పెండింగ్‌లో ఉంచారు. అన్ని అర్హతలు ఉండి..తిరస్కరణకు గురైతే సరియైన పత్రాలతో మళ్లీ ధరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా సమ ర్పించాల్సి ఉంటుంది. 

అర్హులందరికి సాయం అందజేస్తాం

- గుగులోతు రవి నాయక్‌, కలెక్టర్‌

జగిత్యాల జిల్లాలో అర్హులందరికీ కొవిడ్‌ ప్రభుత్వ సాయం అందజే స్తాము. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హులుగా తేల్చిన 897 మంది బాధిత కుటుంబ సభ్యులకు సాయం బ్యాంకు ఖాతాల్లో జమ చేశాము. మిగిలిన దరఖాస్తులను డిస్పోజల్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - 2022-01-23T05:37:34+05:30 IST