Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులకు సాయం

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 28 : భారీ వర్షాలు, వరదల మూలంగా రాజంపేట, నందలూరు మండలాల్లోని గ్రామస్తులు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వరద బాధితుల పక్షాన పట్టణానికి చెందిన శ్రీసాయిరాజేశ్వరీ కాలనీ వాసు లు మేము సైతం అంటూ  సాయమందించారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేకంగా లారీలో వాటిని తోగూరుపేట, మండపల్లి, హరిజనవాడ తదితర ప్రాంతాల్లో 460 కుటుంబాలకు సరిపోయే బియ్యం, కందిబేడలు, చీరలు, దుప్పట్లతో పాటు మరి కొన్ని వస్తువులను తరలించారు.  కార్యక్రమం లో సినీహబ్‌ అధినేత రాజేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేదపాఠశాలకు దుప్పట్లు వితరణ

ప్రొద్దుటూరు పట్టణ శివారులోని శ్రీసాయణ విద్యారణ్య వేదపాఠశాలకు నందమూరి యువసేవా సమితి వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురష్కరించుకుని దుప్పట్ల వితరణగా అందించారు. ఈ మేరకు ఆదివారం నందమూరి యువసేవా సమితి అధ్యక్షులు గోమేధికం సుదర్శన్‌, తెలుగు యువత జిల్లా కార్యదర్శి యమ్మనూరు ఆంజినేయులు  నందమూరి యువసేవా సమితి ఉపాధ్యక్షులు సీజే వెంకటసుబ్బయ్య, గురప్పయాదవ్‌, మల్లిఖార్జున, కుల్లాయప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

గ్యార్మీ సందర్భంగా దివ్యాంగులకు...

దస్తగిరి స్వామి (గ్యార్మీ) పండుగను పురష్కరించుకుని ఆదివారం స్థానిక మట్టిమసీదువీధిలో పండ్ల వ్యాపారి ఖాదర్‌వల్లి తన తల్లిదండ్రులు ఖాదర్‌బాష, సారంబీల జ్ఞాపకార్థం దివ్యాంగులకు విందు భోజనంతో పాటు దుప్ప ట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దాత కుటుంబసభ్యులు అబ్దుల్‌ రఫీ, రహంతుబాష, జిలాన్‌బాష, మౌలా నీ, రబ్బానీ, నూరీ, కరీముల్లా, తాహీర్‌ షఫీవుల్లా, మే ఐ హెల్ఫ్‌యు ఫౌండేషన్‌ చైర్మన్‌ లక్ష్మణ్‌రావు, దివ్యాంగుల చారిటబుల్‌ సొసైటి రాష్ట్ర కన్వీనర్‌ ఆఫ్జల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement