ఆలయాలను తెరిస్తే జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2020-06-05T11:13:58+05:30 IST

ఈ నెల 8 నుంచి దేవాలయాలను తెరిస్తే పలు జాగ్రత్తలు పాటించి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో భక్తులను అనుమతించాలని ..

ఆలయాలను తెరిస్తే జాగ్రత్తలు పాటించాలి

దేవదాయశాఖ సహాయ కమిషనరు ప్రసాద్‌ 


గోదావరి సిటీ, జూన్‌ 4: ఈ నెల 8 నుంచి దేవాలయాలను తెరిస్తే పలు జాగ్రత్తలు పాటించి కట్టుదిట్టమైన  ఏర్పాట్లతో భక్తులను అనుమతించాలని దేవదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనరు కేఎన్వీడీవీ ప్రసాద్‌ కోరారు. గురువారం ఉదయం ఆయన ఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి అర్చకులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలయాలను తెరిచే విషయంలో కేంద్రం సూచనలే తప్ప పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు లేవన్నారు.


ఒకవేళ అనుమతి వచ్చినా ఆరు అడుగుల దూరం పాటిస్తూ భక్తులకు దివ్యదర్శనం మాత్రమే ఉంటుందన్నారు. ప్రదక్షిణ, శఠగోపం, మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు, అంతరాలయ దర్శనం వంటి సేవలేమీ ఉండవన్నారు. మాస్కులను దర్శించి చేతులను శానిటైజ్‌ చేసుకున్న అనంతరమే భక్తులకు ఆలయ ద్వారం వద్ద ప్రవేశముంటుందన్నారు. అనంతరం ఆయన సోమాలమ్మ గుడి, వేణుగోపాలస్వామి, ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - 2020-06-05T11:13:58+05:30 IST