ఆక్రమిత దేవదాయ భూముల స్వాధీనానికి చర్యలు

ABN , First Publish Date - 2020-07-15T11:00:00+05:30 IST

జిల్లాలో దేవదాయ శా ఖ కు సంబంధించి ఆక్రమణలో ఉన్న భూముల ను, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు...

ఆక్రమిత దేవదాయ భూముల స్వాధీనానికి చర్యలు

అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ


వేంపల్లె, జూలై 14: జిల్లాలో దేవదాయ శా ఖ కు సంబంధించి ఆక్రమణలో ఉన్న భూముల ను, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్‌ క మిషనర్‌ శంకర్‌బాలాజీ తెలిపారు. ఆక్రమణలో ఉన్న వేంపల్లె మండలంలోని నందిపల్లె, అలవలపాడు, తాళ్లపల్లె భూములను పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ కు సంబంధించిన భూములు, స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అనే విషయం పరిశీలించేందుకు ఆ యా ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమిత భూములపై చర్యలు ఉంటాయని తెలిపారు. 


వృషభాచలేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి 

వృషభాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషిచేస్తున్నట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ పేర్కొన్నారు. ఎద్దల కొండపై అభివృద్ధి ప నులకు నిధులు కేటాయించాలని, ఇటీవల ఆల య చైర్మన్‌ జయచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ రవికుమార్‌రెడ్డి సీఎం జగన్‌, ఎంపీ అవినా్‌షరెడ్డి, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డికి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించా రు. అందుకు సంబంధించి అంచనాలను రూ పొందించేందుకు మంగళవారం ఎద్దల కొండ వృషభాచలేశ్వర ఆలయాన్ని ఏసీ శంకర్‌బాలాజి, డీఈ గంగయ్య, ఈఓ ప్రతా్‌పలు సందర్శించారు. స్థానిక నాయకులతో చర్చించారు. 

Updated Date - 2020-07-15T11:00:00+05:30 IST