11 కేవీ విద్యుత్‌ లైన్‌కు తగిలిన కంటైనర్‌

ABN , First Publish Date - 2020-12-03T06:12:02+05:30 IST

11 కేవీ విద్యుత్‌ లైన్‌కు కంటైనర్‌ లారీ తగలడంతో టైరు మార్చేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్‌ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో చోటు బుధవారం చేసుకున్నది.

11 కేవీ విద్యుత్‌ లైన్‌కు తగిలిన కంటైనర్‌
కంటైనర్‌కు తగిలిన 11 కేవీ విద్యుత్‌ లైన్‌ వైర్లు

కరెంటు షాక్‌కు గురైన డ్రైవర్‌ 

లారీకి అతుక్కుపోయి అక్కడికక్కడే మృతి

టైర్‌ మార్చేందుకు ప్రయత్నిస్తుండగా ఘటన


మనోహరాబాద్‌, డిసెంబరు 2 : 11 కేవీ విద్యుత్‌ లైన్‌కు కంటైనర్‌ లారీ తగలడంతో టైరు మార్చేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్‌ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో చోటు బుధవారం చేసుకున్నది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కాళ్లకల్‌లోని మీరా దేవీ ఫ్యామిలీ దాబా వద్ద బుధవారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం మెయిన్‌పుల్‌ జిల్లా, సైపాయి గ్రామానికి చెందిన డ్రైవర్‌ దిలీప్‌ కుమార్‌ (26) ఢిల్లీ నుంచి హైదారాబాద్‌ వైపు ద్విచక్ర వాహనాల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను నిలుపుకున్నాడు. అక్కడే టైరు రిపేర్‌ షాపు ఉండడంతో రిపేర్‌ చేయించేందుకు డ్రైవర్‌ దిలీ్‌పకుమార్‌ లారీ కింద బాగానా జాకీ పెట్టి పైకి లేపే ప్రయత్నం చేశాడు. లారీ పైభాగం నుంచి ఉన్న 11 కేవీ విద్యుత్‌ లైన్‌ ఉంది. అది దిలీప్‌ కుమార్‌ గమనించలేదు. దీంతో పైన ఉన్న విద్యుత్‌ లైన్‌కు కంటైనర్‌ తగిలింది. లారీకి విద్యుత్‌ సరఫరా అయ్యి లారీని, జాకీ రాడ్‌ను పట్టుకుని ఉన్న దిలీప్‌ షాక్‌కు గురయ్యాడు. ఒక్కసారిగా లారీకి అతుక్కుపోయి మృతిచెందాడు. స్థానికులు విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో కరెంటు సరఫరాను నిలిపివేశారు. లారీకి అతుక్కుపోయిన మృతదేహాన్ని స్థానికులు లారీ నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2020-12-03T06:12:02+05:30 IST